»Ipl Auction Franchises That Have Become A Headache
IPL Auction: ఐపీఎల్ వేలం.. తలనొప్పిగా మారిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ ఆక్షన్ మరో నాలుగు ఐదు నెలల్లో జరగనుంది. దాంతో ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. పనిలో పనిగా ఐపీఎల్ అధికారులకి తన కోర్కెల చిట్టాను సమర్పించాయి. మెగా ఆక్షన్ ఎప్పుడు జరపాలి? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరపాలి? ఎంత మందిని రీటైన్ చేసుకోవచ్చు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను సుస్పష్టంగా వెల్లడించాయి.
IPL Auction.. Franchises that have become a headache
IPL Auction: ఐపీఎల్ ఆక్షన్ మరో నాలుగు ఐదు నెలల్లో జరగనుంది. దాంతో ఇప్పటి నుంచే అన్ని ఫ్రాంచైజీలు తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. పనిలో పనిగా ఐపీఎల్ అధికారులకి తన కోర్కెల చిట్టాను సమర్పించాయి. మెగా ఆక్షన్ ఎప్పుడు జరపాలి? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరపాలి? ఎంత మందిని రీటైన్ చేసుకోవచ్చు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను సుస్పష్టంగా వెల్లడించాయి.
మెగా ఆక్షన్ టైమ్‌ను పెంచమని దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. ఒక ఆటగాడిని గుర్తించి, అతడిని ఒక ఆయుధంగా తయారు చేయడానికి దాదాపుగా రెండు మూడేళ్లు పట్టవచ్చు. ఆ తర్వాత ఆ ఆటగాడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతి జట్టు భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ జరుగుతోంది. ఆ నిబంధనను సవరించాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి ఆక్షన్ నిర్వహించాలని కోరుతున్నాయి.
ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే…. తిలక్ వర్మ వంటి ఆటగాడిని గుర్తించి, తీర్చి దిద్దారు. ఇప్పుడు సడెన్‌గా ఆక్షన్ కారణంగా అతడిని వదులుకోవలసి వస్తోంది. అలా కాకుండా ఐదేళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ నిర్వహించినట్లయితే… ప్రతి జట్టుకు తమ కోర్ టీమ్‌ను తయారు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మూడేళ్లకు ఒకసారి మెగా ఆక్షన్ చేస్తున్న కారణంగా జట్టులో ఉన్న కీ ప్లేయర్లలో కొందరిని వదులుకోకతప్పడం లేదు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. మరో వారం పది రోజుల్లో ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఐపీఎల్ మ్యాచుల సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరగనుంది. ఐపీఎల్ 2024లో 74 మ్యాచులు జరిగాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరగనుంది. రెండేళ్ల పాటు 84 మ్యాచులు జరగనున్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగి 94కి చేరనుంది.