Dhoni Birthday: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ధోనీ క్రికెట్ ఆడటం మానేసి ఉండవచ్చు, కానీ ఆయన పై క్రికెట్ అభిమానుల్లో మాత్రం ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. సోషల్ మీడియా వినియోగదారులు ప్రస్తుతం ధోనీ ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ధోనీ రాంచీలో ఒక స్పెషల్ బిజినెస్ చేస్తున్నారు. దాని నుండి అతను పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు. అదేంటో తెలుసుకుందాం.
కడక్‌నాథ్ చికెన్ వ్యాపారం
మహేంద్ర సింగ్ ధోనీ కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నాడు. ఆయనకు రాంచీలో కడక్‌నాథ్ కోళ్లకు సంబంధించిన చాలా పెద్ద పౌల్ట్రీ ఫారం ఉంది. భారతదేశంలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ప్రారంభించడానికి కోట్ల రూపాయలు అవసరం లేని వ్యాపారం ఇది. కేవలం కొన్ని లక్షల రూపాయలతో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం ప్రారంభించవచ్చు. విశేషమేమిటంటే, పల్లెలు, గ్రామాలు, నగరాలు, మెట్రోలలో కూడా పౌల్ట్రీ ఫారమ్ వ్యాపారం ప్రారంభించవచ్చు, ఎందుకంటే చికెన్‌కు ప్రతిచోటా డిమాండ్ ఉంది. చలికాలంలో కోడిగుడ్లకు డిమాండ్ ఉండగా.. వేసవి వచ్చిందంటే చాలు ప్రజల చికెన్ బాగా తింటారు. అయితే డబ్బున్న వారు దేశీ కోడి మాంసం తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా పౌల్ట్రీ ఫామ్‌లతో సంబంధం ఉన్న వ్యక్తులు కడక్‌నాథ్ కోడిని పెంచడం ప్రారంభిస్తే, వారు మరింత సంపాదించవచ్చు.
కడక్‌నాథ్ కోడి చాలా ఖరీదైనది. ఒక్కో గుడ్డు ధర రూ.50కి పైగా పలుకుతోంది. దీని మాంసం కిలో 1000 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కడక్‌నాథ్ చికెన్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కడక్‌నాథ్ కోడి పెంపకం వల్ల సాధారణ చికెన్ కంటే చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది. కడక్‌నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి. అయితే ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా పౌల్ట్రీ ఫామ్‌లలో కడక్‌నాథ్ కోళ్లను పెంచుతున్నారు. కడక్‌నాథ్ చికెన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దాని రెక్కలు, ముక్కు, కాళ్లు, రక్తం, మాంసం అన్నీ నల్లగా ఉంటాయి. విశేషమేమిటంటే దీని గుడ్లు కూడా నలుపు రంగులో ఉంటాయి. సాధారణ దేశీ చికెన్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. అందువల్ల దాని డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే..
మీరు కడక్‌నాథ్ కోడి పెంపకం కోసం పౌల్ట్రీ ఫారమ్‌ను తెరవాలనుకుంటే, మీకు కనీసం 150 చదరపు అడుగుల స్థలం అవసరం. ఒక షెడ్డును నిర్మించడం ద్వారా, మీరు ఈ స్థలంలో దాదాపు 100 కడక్‌నాథ్ కోడిపిల్లలను పెంచవచ్చు. ఈ కోడిపిల్లలు 5 నెలల్లో పూర్తిగా అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో రూ.800 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. ఒక్క గుడ్డు ఖరీదు రూ.50కి పైగా ఉంది. కడక్‌నాథ్ చికెన్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా, మీరు 5 నెలల తర్వాత వేల రూపాయలు సంపాదించవచ్చు. కడక్‌నాథ్‌లో దేశీ చికెన్‌తో పోలిస్తే 25శాతం ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.