»Jharkhand 3 Storey Building Collapse Many People Trapped Rescue Operation Underway
Building Collapse : జార్ఖండ్ లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
సూరత్ లాంటి పెద్ద ప్రమాదం జార్ఖండ్‌లో కూడా జరిగింది. ఇక్కడ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Building Collapse : సూరత్ లాంటి పెద్ద ప్రమాదం జార్ఖండ్‌లో కూడా జరిగింది. ఇక్కడ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని డియోఘర్‌లో చోటు చేసుకుంది. భవనం కూలిన వెంటనే కేకలు రావడంతో రెస్క్యూ టీం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రమాదం తరువాత, ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీయగా ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలుస్తోంది. డియోఘర్ డిసి విశాల్ సాగర్ మాట్లాడుతూ.. ఇక్కడ మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ఇద్దరు వ్యక్తులను రక్షించి సదర్ ఆసుపత్రికి తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇల్లు అంత పటిష్టంగా లేకపోవడంతో కూలిపోయిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరుపుతామని, అయితే ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రాధాన్యతనిస్తోందని ఆయన అన్నారు.
#WATCH | A house collapsed in Jharkhand's Deoghar. Rescue operation underway by NDRF and district officials pic.twitter.com/Lg28aKmVKl
శనివారం తెల్లవారుజామున సూరత్‌లో ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో కలకలం రేగింది. ఈ ఘటన సచిన్ జీఐడీసీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందగా, ఒక మహిళను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదం చాలా భయంకరంగా ఉంది. శిథిలాల కింద నుండి ప్రజల కేకలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి 12 గంటలకు పైగా గడిచినా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఈ భవనాన్ని 2017లో నిర్మించారు. ఈ భవనంలో మొత్తం 30 ఫ్లాట్లు ఉండగా.. అందులో ఐదింటిలో ప్రజలు నివసిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో కొందరు పనికి వెళ్లగా, కొందరు ఇంట్లో నిద్రిస్తున్నారు.