ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై పోషకాహార సమచార లేబులింగ్ విషయంలో ఆహార నియంత్రణ సంస్థ మార్పులు చేసింది. ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వును బోల్డ్ అక్షరాలతో పాటు ఫాంట్ పరిమాణంలో ప్రదర్శించాలని తెలిపింది.
FSSAI: Mandatory bold nutrition labels on packaged foods
FSSAI: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై పోషకాహార సమచార లేబులింగ్ విషయంలో ఆహార నియంత్రణ సంస్థ మార్పులు చేసింది. ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వును బోల్డ్ అక్షరాలతో పాటు ఫాంట్ పరిమాణంలో ప్రదర్శించాలని తెలిపింది. దీనిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ అపూర్వ చంద్ర అధ్యక్షతన జరిగిన ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో పోషకాహార సమాచారం లేబులింగ్‌కు సంబంధించి ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండర్డ్స్ నిబంధనల సవరణను ఆమోదించాలని 2020లోనే నిర్ణయం తీసుకున్నారు.
వినియోగదారులకు వాళ్లు వినియోగించే ఉత్పత్తి పోషక విలువలు బాగా అర్థం చేసుకోవడానికి, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్పష్టమైన, ప్రత్యేక లేబులింగ్ అవసరాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ఎన్సీడీలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తామని తెలిపింది. అలాగే హెల్త్ డ్రింక్ అనే పదాన్ని ఎక్కడ నిర్వచించలేదని తొలగించాలని తెలిపింది. అలాగే పండ్ల రసాల లేబుల్లు, ప్రకటనల నుంచి 100 శాతం పండ్ల రసాల క్లెయిమ్‌ను తీసివేయమని అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను కోరింది. ఎఫ్బీఓ ద్వారా తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లను నిరోధించాలని ఆదేశాలు జారీ చేశాయి.