Abhishek Nair: క్రికెట్లో సెక్స్ .. అభిషేక్ నాయర్ ఏం చెబుతున్నారు?
ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నాయర్ అనేక విషయాలపై తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా వెల్లడించాడు. టోర్నమెంట్లు జరిగే సందర్భంగా క్రికెటర్లు.. సెక్స్‌లో పాల్గొనడం సర్వసాధారణ విషయమని నాయర్ వెల్లడించాడు.
Abhishek Nair: క్రికెట్ ఆడే ఆటగాళ్లు.. ప్రతి మ్యాచ్‌కు ముందు సెక్స్‌లో పాల్గొంటారా? అలా చేయడం ద్వారా వారి ఆట తీరు మెరుగ్గా ఉంటుందా? ఫోకస్ పెరుగుతుందా? ఈ విషయంలో మన టీమిండియా ప్లేయర్ల వైఖరి ఎలా ఉంది? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఐపీఎల్ 2024లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు … తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. ఈ జట్టును విజయపథంలో నడిపించిన వారిలో గౌతం గంభీర్‌తో పాటు మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లు… అభిషేక్ నాయర్ పనితీరును ఎంతగానో ప్రశంసించారు. ఇటీవలే ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నాయర్ అనేక విషయాలపై తన అభిప్రాయాలను చాలా స్పష్టంగా వెల్లడించాడు. టోర్నమెంట్లు జరిగే సందర్భంగా క్రికెటర్లు.. సెక్స్‌లో పాల్గొనడం సర్వసాధారణ విషయమని నాయర్ వెల్లడించాడు.
కీలకమైన మ్యాచుల ముందు చాలా మంది కోచ్‌లు ఆటగాళ్లకు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆటకు ముందు రోజు సెక్స్‌లో పాల్గొనాలని కొందరు కోచ్‌లు సూచిస్తే…సెక్స్‌లో పాల్గొనవద్దని మరికొందరు కోచ్‌లు సూచిస్తుంటారు. భార్యలను, గర్ల్ ఫ్రెండ్లను క్రికెటర్లతో అనుమతించే వారు కొందరైతే, అనుమతించని వారు మరికొందరు ఉంటారు. ఇటువంటి విషయాలపై అభిషేక్ నాయర్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఒక్కొక్కరి వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా వారు నిర్ణయం తీసుకుంటారని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు రోజు సెక్స్‌లో పాల్గొనే అనేక మంది ఆటగాళ్లకు … ఫోకస్ పెరిగి ఆటలో రాణించడం జరిగిందని గుర్తుచేశాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డో రొజారియో గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలను ఈ సందర్భంగా అభిషేక్ నాయర్ గుర్తుచేసుకున్నాడు. చాలా మ్యాచ్‌లకు ముందు తాను సెక్స్‌లో పాల్గనడం వల్ల ఫోకస్ పెరిగిందని రొనాల్డో చెప్పిన విషయాన్ని అభిషేక్ నాయర్ వెల్లడించాడు.
2011లో భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంలో అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కీలక పాత్ర పోషించాడు. అప్పటి వరకు ఉన్న కొన్ని నిబంధనలను సడలించాడు. ఆటగాళ్లు అందరూ తమ తమ భార్యలతో కలిసి ఉండేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే విధంగా పెళ్లికాని ఆటగాళ్లకు తమ తమ గర్ల్ ఫ్రెండ్లతో కలిసి ఉండేందుకు కూడా అనుమతించాడు. కోచ్ తీసుకున్న ఆ నిర్ణయం ఆటగాళ్ల ఆటతీరుపై ప్రభావం చూపింది. భారత జట్టుకు ప్రపంచ కప్‌ను అందించింది.