Kalki: షాకింగ్.. ముంబై పోలీసులకు దొరికిపోయిన భైరవ ‘బుజ్జి’!
ఓ సినిమా కోసం ప్రత్యేకంగా కోట్లు పెట్టి కారు తయారు చేయడం, దాన్ని రోడ్ల పై తిప్పుడు ప్రమోట్ చేయడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటి సారి కావచ్చు. అందుకే.. కల్కి పైనే అందరి దృష్టి ఉంది. తాజాగా బుజ్జి ముంబై పోలీసులకు దొరికిపోయింది.
Shocking.. Bhairava 'Buzzy' found by Mumbai police!
Kalki: మామూలుగా అయితే డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వెహికల్స్ని పట్టుకొని సీజ్ చేస్తుంటారు పోలీసులు. మరి ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుజ్జి కారుకి పేపర్లు లాంటి ఉన్నాయా? అంటే, లేనే లేవు. దీంతో పోలీసుల చేతికి దొరికిపోయింది బుజ్జి. మరి బుజ్జిని ముంబై పోలీసులు ఏం చేశారు? అంటే, అసలు మ్యాటర్ వేరే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకోనే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్న కల్కి 2898ఏడి సినిమాను.. దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ దాదాపు 600 కోట్ల బడ్జెట్తో కల్కిని నిర్మిస్తున్నారు. జూన్ 27న కల్కి గ్రాండ్గా థియేటర్లోకి రాబోతోంది.
దీంతో ఈ మోస్ట్ అవైటేడ్ చిత్రాన్ని దేశమంత తిరిగి గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. బుజ్జి కారుని రోడ్లపై తిప్పుతూ ప్రమోట్ చేస్తున్నారు. మొదటగా హైదరాబాద్లో సందడి చేసిన బుజ్జి.. ఆ తర్వాత చెన్నై సిటీలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ముంబైలో ఉంది బుజ్జి. అక్కడ బీచ్ రోడ్డులో బుజ్జిని చూసి ఫిదా అవుతున్నారు జనాలు. అయితే.. పోలీసులు కూడా బుజ్జికి పడిపోయారు. దీంతో.. ముంబై పోలీసులు బుజ్జిని డ్రైవ్ చేసిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బుజ్జిని ఆరు టన్నుల బరువుతో దాదాపు 7 కోట్ల రూపాయలతో తయారు చేయించారు. సినిమాలో బుజ్జిది చాలా కీలక పాత్ర. దీనికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పడం విశేషం. మొత్తంగా.. ప్రభాస్, బుజ్జి కాంబినేషన్ మాత్రం అదిరిందనే చెప్పాలి. మరి కల్కి సినిమాలో బుజ్జి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.