»Decoding Kalkis Hindi Box Office Best At 2024 Bollywood Box Office Record
Bollywood : ఈ ఏడాది బాలీవుడ్ సినిమాల్లో టాప్ కలెక్షన్లు కల్కి డార్లింగ్వే!
బాలీవుడ్ ఈ ఏడాది భారీ సినిమా హిట్లు లేక వెలవెలబోయింది. బాక్సాఫీసు చిన్నబోయింది. ఆ సమయంలో వచ్చిన కల్కి 2898 AD'యే అక్కడ ఇప్పటి వరకు పెద్ద హిట్. 2024లో ఈ సినిమా వసూళ్లే ఇక్కడ ఇప్పటి వరకు టాప్. డార్లింగ్ లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
Kalki 2898 AD: Are all these unnecessary in Kalki..?
Kalki Bollywood Boxoffice : ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్లో సరైన హిట్ సినిమాయే లేదు. ఎగ్జిబిషన్ సెక్టార్ సైతం చాలా క్షీణించింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కల్కి 2898 ఏడీ సినిమాయే ఇప్పటి వరకు అక్కడ పెద్ద హిట్. డార్లింగ్ సినిమాకి వచ్చిన కలెక్షన్లే అక్కడ ఇప్పటి వరకు టాప్. ఈ విషయాన్ని అక్కడ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. హిందీ సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ బాగా క్షీణించిందని అంటున్నారు. గత ఆరు నెలల్లో 20 నుంచి 30 శాతం క్షీణత ఉన్నట్లు చెబుతున్నారు.
బాలీవుడ్లో 2024లో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఆశించిన విధంగా ఫలితాలను ఇవ్వలేదు. యోధ, బడేమియాన్-చోటే మియాన్, మైదాన్ లాంటి భారీ సినిమాలు సైతం అనుకున్నంతగా రాణించలేదు. దీంతో మొదటి ఆరు నెలల ఫలితాలు దారుణంగా పడిపోయాయి. అయితే బాలీవుడ్ రిపోర్ట్ కార్డును మెరుగుపరిచేందుకే ఇప్పుడు కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD) సినిమాయే వచ్చిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఫలితాలు నెగటివ్‌గా ఉండేవని అంటున్నారు.
పెద్ద బడ్జెట్ సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాలే కాస్త వసూళ్లు సాధించాయని బాలీవుడ్(Bollywood) ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. లాపటా లేడీస్(రూ.20కోట్లు, ముంజ్యా(98కోట్లు) వసూళ్లు సాధించాయని అంటున్నారు. అయితే బాలీవుడ్లో డబ్బింగ్ సినిమా అయిన కల్కి(Kalki) మాత్రం ఇప్పటి వరకు రూ.300 కోట్ల వసూళ్లు సాధించిందని టాక్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఇప్పటి వరకు రూ.900 కోట్లకు పైగా వసూలు చేసింది.