»Injury Update For Rohit Sharma In The First Match Of The T20 World Cup In Ireland
Rohit Sharma: రోహిత్ శర్మ ఇంజూర్పై తాజా అప్డేట్
టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్ శుభారంభం చేసింది. అయితే పిచ్ కారణంగా బంతి బౌన్స్ అయింది. దీంతో ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఇంజూరీతో ఆట మధ్యనుంచే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాడు. ఇప్పుడు గాయంపై ఆయనే స్వయంగా స్పందించారు.
injury update for Rohit Sharma in the first match of the T20 World Cup in Ireland
Rohit Sharma: న్యూయార్క్ వేదికగా టీ20 వరల్డ్‌కప్‌లో మొదటి ఆటను భారత్ ప్రదర్శించింది. ఐర్లాండ్‌తో తలపడిన భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. పిచ్ కారణంగా రోహిత్ శర్మ(Rohit Sharma) గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతని చేయికి బంతి తగిలింది. పేస్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్‌లో రిటైర్డ్ హార్ట్‌గా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 37 బంతుల్లోనే 52 రన్స్ చేశి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్ ఇలా వెళ్లిపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ వలప బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. పేసర్లు విసిరిన బంతులు నేరుగా బ్యాటర్ల మీదకు రావడంతో ఒక దశలో క్రీజ్‌లో ఉన్నవాళ్లు ఇబ్బంది పడ్డారు.
ఆఫ్ సెంచరీ చేసిన రోహిత్ గాయం కారణంగా వెళ్లిపోయాడు. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ ఆయన స్థానంలో వచ్చారు. అయితే రోహిత్ గాయం అంత సీరియస్ కాదని తెలుస్తోంది. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా చెప్పారు. కాస్త నొప్పిగా ఉందని మ్యాచ్ అనంతరం చెప్పాడు. ఈయనతో పాటు రిషబ్ పంత్ కూడా గాయపడ్డాడు. ఈ పిచ్‌పై ఇప్పుడు విమర్శులు వస్తున్నాయి. కేవలం 5 నెలల క్రితమే తయారు చేసిన దీనిగురించి చెప్పడం కష్టమేనని రోహిత్ చెప్పాడు. ఇదే పిచ్‌పై జూన్ 9న ఇండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీనికోసం అన్ని విధాలా సన్నద్ధం కావాలని రోహిత్ శర్మ చెప్పారు.