TG: తెలంగాణ విద్యుత్తు ఉత్పాదక సంస్థలో ఇంజినీర్లు, సిబ్బంది బదిలీలకు సంస్థ పచ్చజెండా ఊపింది. ఆశావాహులు ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే తేదీల్లో ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. ఈ నెల 23 నుంచి 29 వరకు దరఖాస్తుల పరిశీలన జరిపి, బదిలీల జాబితా రూపొందిస్తారు. ఈ నెల 30, 31 తేదీల్లో బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు.