»Sania Mirza Mohammed Shami Wedding Rumours This Is What Imran Mirza Said
Sania Mirza: షమీతో సానియా మీర్జా పెళ్లి?.. ఆమె తండ్రి ఏమంటున్నారంటే?
క్రికెటర్ షమీని బ్యాట్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా పెళ్లాడబోతున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయమై సానియా మీర్జా తండ్రి స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
Sania Mirza: పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న టెన్నిస్ స్టార్ సానియో మీర్జా పెళ్లి విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె మళ్లీ క్రికెటర్ షమీని పెళ్లాడబోతున్నారని(Wedding) వార్తలు వ్యాపించాయి. మహ్మద్ షమీ( Mohammed Shami) కూడా కొద్ది రోజులుగా భార్యతో దూరంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకుంటున్నారని ఊహాగానాలు వ్యాపించాయి. ఈ విషయమై సానియా(Sania) తండ్రి ఇమ్రాన్ మీర్జా( Imran Mirza) ఓ ఇంగ్లిష్ మీడియా దగ్గర స్పందించారు.
సానియా, షమీ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఇమ్రాన్ అన్నారు. అవన్నీ చెత్త వార్తలంటూ కామెంట్ చేశారు. సానియా ఇప్పటి వరకు షమీని కలవనైనా కలవలేదని చెప్పుకొచ్చారు. ఈ వార్తలన్నీ ఉత్తవేనంటూ కొట్టి పడేశారు. సానియా మీర్జా(Sania Mirza) ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైరైన సంగతి తెలిసిందే.
తాజాగా సానియా హజ్ యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కొన్ని సంగతుల్ని పంచుకున్నారు. తాను మారుతున్నానని ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని తాను దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సానియా చెప్పారు. తన ప్రార్థనలను అల్లా ఆలకిస్తాడని ఆమె తెలిపారు. తాను చాలా అదృష్ణవంతురాల్ని కాబట్టే హజ్ యాత్రకు వెళుతున్నానని ఆమె రాశారు. ఒక మంచి మనిషిలా తాను తిరిగి వస్తానని ఆమె హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.