Allu Arjun: ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6కి పుష్ప2ని పోస్ట్ పోన్ చేశారు. దీనికి కారణం షూటింగ్ డిలే అవడం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అవడమేనని.. అలాగే క్వాలీటి అవుట్ ఇవ్వడానికి ఇంకాస్త సమయం కావాలని క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కానీ అసలు కారణం వేరే ఉందని కాస్త గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగాభిమానుల్లో బన్నీ పై పెద్ద ఎత్తున వచ్చిన నెగెటివిటీ ఓ కారణంగా చెబుతున్నారు. ఈసారి ఏపి ఎన్నికల్లో మెగా వర్సెస్ అల్లు వార్ ఎలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఏపి ఎన్నికల్లో వైసీపి అభర్తి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేశాడు బన్నీ. అదేరోజు రామ్ చరణ్, పవన్ కోసం పిఠాపురం వెళ్లాడు. ఫైనల్‌గా జనసేన భారీ విజయాన్ని అందుకుంది. కానీ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన వ్యక్తి ఓడిపోయాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌కు టార్గెట్ అయిపోయాడు బన్నీ. ఏకంగా నాగబాబు సైతం ఈ విషయంలో ఫైర్ అయ్యాడు. మొత్తంగా బన్నీ పై గట్టి నెగెటివిటీ ఏర్పడింది.
ఇలాంటి సమయంలో పుష్ప రిలీజ్ చేయకపోవడమే బెటర్ అని మేకర్స్ భావించినట్టుగా కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరో న్యూస్ కూడా వైరల్‌గా మారింది. పుష్ప సినిమాతో బన్నీకి దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ బన్నీతో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ సల్మాన్ ఖాన్ చేతికి వెళ్లింది. షారుఖ్ ఖాన్ వల్లే ఇది జరిగిందని అంటున్నప్పటికీ.. దీనికి వెనక మెగా ఫ్యామిలీ హస్తం ఉందనే అనుమానం అల్లు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు అట్లీ, బన్నీ సినిమా అనౌన్స్ చేయలేదు. కనీసం ఈ ఇద్దరు కలిసినట్టుగా ఒక్క ఫోటోల కూడా బయటికి రాలేదు. అలాంటప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం, క్యాన్సిల్ అయిందని చెప్పలేం. కానీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.