CTR: శ్రీకృష్ణదేవరాయల జయంతిని సదుంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన ఘనత రాయలకు దక్కిందని నాయకులు చెప్పారు. ఆయన పాలన స్వర్ణ యుగమని పేర్కొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.