Smoking Side Effects: ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం అందరికీ తెలిసిందే. బీడీ-సిగరెట్ ప్యాకెట్లపై సిగరెట్ స్మోకింగ్ హనికరం అని రాసినా పొగతాగడం మానడం లేదు. ఈ అలవాటు క్రమంగా శరీరాన్ని పాడు చేస్తుంది, దీని కారణంగా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ధూమపానం చేసే వ్యక్తులు తరచుగా నల్లటి పెదవులు కలిగి ఉంటారు. ధూమపానం వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయి. వాటి రంగు కూడా పాడవుతుందని వైద్యులు తెలిపారు. అయితే ధూమపానం వల్ల నల్లబడిన పెదాలను ఎలా మార్చుకోవాలో నిపుణులు సూచించారు.
పెదవులు ఎందుకు నల్లగా మారుతాయి?
సిగరెట్ తాగే సమయంలో పెదవుల చుట్టూ ఉండే చర్మ కణాలు వేడి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి యాక్టివ్గా మారి మెలనిన్ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. అయితే, ఈ ప్రక్రియ ద్వారా చర్మం వేడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. సిగరెట్లలో నికోటిన్ ఉన్నందున, ఇది రక్త నాళాలు కుంచించుకుపోవడానికి, సంకుచితానికి కారణమవుతుంది. దీని వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇది కాకుండా, చర్మం మృదువుగా ఉండటానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాల కొరత ఏర్పడుతుంది. నికోటిన్ వల్ల పెదవులు కూడా నల్లగా మారుతాయి.
పెదాలను ఎలా చూసుకోవాలి
పెదవుల పైన చర్మం నల్లగా మారితే రోజ్ వాటర్, గ్లిజరిన్ను దూదిలో తీసుకుని పెదవులపై బాగా రుద్దండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ పెదాలు గులాబీ రంగులోకి మారి మృదువుగా మారుతాయి. పెదవుల నల్లని డెడ్ స్కిన్ను తొలగించడానికి కాఫీ పొడితో స్క్రబ్బింగ్ చేయడం మంచి ఎంపిక. పెదవుల నలుపును పోగొట్టడంలో కూడా ఇది సహాయపడుతుంది. పెదాల నిస్తేజాన్ని తొలగించడానికి గ్రీన్ టీ కూడా మంచి పరిష్కారం. దీని కోసం ఒక కప్పు వేడి నీటిలో ఒక బ్యాగ్ గ్రీన్ టీని మరిగించి, దానికి ఒక చెంచా తేనె వేసి, పెదవులపై మసాజ్ చేయండి. అంతే కాకుండా కలబంద గుజ్జును రోజుకు రెండు మూడు సార్లు పెదవులపై రాస్తే నలుపు పోతుంది.