NLG: తిప్పర్తి గౌతమ్ మోడల్ స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడంతో జంగారెడ్డిగూడెంలో రెండు పెంపుడు కుక్కలు మృతి చెందాయి. ప్రశ్నించిన యజమానిపై ప్రిన్సిపల్ దుర్భాషలాడి నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలున్నాయని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.