CM Revanth Reddy: హోలీ పండుగ సందర్భంగా దేశమంత సంబరాలు చేసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు. మనవడు రేయాన్స్ తో కలిసి హోలీ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా హోలీ సంబరాలు చేసుకున్నారు. మనవడితో కలిసి రంగులు పూయించుకుంటూ ఉల్లాసంగా కనిపించారు. ఈ వేడుకల్లో రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కూడా పాల్గొన్నారు.
సీఎం ఇంట్లో హోలీ సంబరాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి చిన్న కుమార్తె నైమిష గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు తల్లిదండ్రులు రేయాన్స్ అని పేరు పెట్టారు. హోలీ సందర్భంగా సీఏం సరదగా గడిపిన ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మనువడితో సీఏం హోలీ సెలబ్రెషన్స్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.