»Babu Mohan As Telangana State President Of Prajashanthi Party
Babu Mohan: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా బాబుమోహన్
బీజేపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన బాబు మోహన్ ఇటీవలే కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. దీంతో ఆయనకు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించింది.
Babu Mohan as Telangana State President of Prajashanthi Party
Babu Mohan: సినీ నటుడు, రాజకీయ నాయకుడు బాబు మోహన్ ఇటీవలే కేఏ పాల్ స్థాపించిని ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనకు పార్టీ కీలక పదవులు అప్పగించింది. ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) తెలంగాణ అధ్యక్షుడిగా(Telangana President) మాజీ మంత్రి బాబూ మోహన్‌ను (Babu Mohan) ఆ పార్టీ అధినేత కేఏ పాల్ నియమించారు. గతంలో ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రత్యామ్నాయ పార్టీని ఎంచుకున్నానని వెల్లడించారు.
టీడీపీతోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది అందులో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తరువాత బీజేపీ కండువ కప్పుకున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆయనకు చివరి నిమిషంలో అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బీఆర్ఎస్ నుంచి చంటి క్రాంతి కిరణ్ రెండో స్థానంలో నిలిచారు. ప్రచారానికి కూడా సమయం సరిపోలేదని బాబు మోహాన్ వాపోయారు. తరువాత పార్టీ కార్యక్రమాల్లో ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదనే ఆరోపణలు చేస్తూ బీజేపీ రాజీనామా చేసి ప్రజా శాంతి పార్టీలో జాయిన్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో ఆయన వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది.