Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేహ్‌లో సైనికులతో కలిసి హోలీ పండుగను జరుపుకున్నారు. గులాల్‌తో సైనికులకు తిలకం దిద్ది హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సైనికులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ మంది అనేక సందర్భాల్లో సైనికులను కలుస్తూనే ఉంటారు. అయితే హోలీ సందర్భంగా మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషమనిపించిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. హోలీ, దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి అనేక పండుగల సమయంలో ప్రజలు ఎక్కడ ఉన్నా వారు తమ కుటుంబాలకు తిరిగి వస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకోవడానికి.. నేను మా కుటుంబం మధ్యకు వచ్చాను. నేను నా కుటుంబంతో హోలీ ఆడేందుకు అని అన్నారు.
దీపావళికి తొలి దీపం, హోలీకి తొలి రంగు, ఇదంతా మన కాపలాదారుల పేరిటే ఉండాలని రక్షణ మంత్రి అన్నారు. మన సైనికులతో కలిసి ఉండాలి. పండుగలు మొదట సియాచిన్, కార్గిల్ శిఖరాలపై జరుపుకోవాలి. రాజస్థాన్‌లోని మండే ఇసుక మైదానాలలో, హిందూ మహాసముద్రం లోతులలో జలాంతర్గాములలో భారతీయ నావికాదళ నావికులు ఉంటారు. మీరు చేస్తున్న దేశసేవ మామూలు పని కాదు. దానికి ఎన్ని కోట్లు ఇచ్చిన తక్కువే అన్నారు. మీ కుటుంబాలను ఆదుకోవడం మా కర్తవ్యమని, అందుకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి సైనికులకు చెప్పారు.