»Indian Army Technical Entry Scheme Eligibilty And Age Limit
TES 2024 : ఇండియన్ ఆర్మీ కోసం.. ఉచితంగా ఇంజనీరింగ్ + మిలటరీ ట్రైనింగ్
ఇంటర్ చదివిన అవివాహిత పురుషులకు మాత్రమే ఇండియన్ ఆర్మీ టీఈఎస్ 2024 పరీక్షలు రాయవచ్చు. ఎంపికైన వారికి ఉచితంగా ఇంజనీరింగ్ విద్యతో పాటు మిలటరీ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు.
Indian Army TES 2024 : భారత సైన్యంలో పని చేయాలని అనుకునే వారికి మంచి అవకాశం. ఇంటర్ చదివిన అవివాహిత పురషులు మాత్రమే దీనికి అర్హలు. ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా అందించి దానితో పాటు మిలటరీ ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకుంటారు. ఇందుకోసం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(TECHNICAL ENTRY SCHEME)నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఆర్మీలో(ARMY) చేరాలనుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఇందులో అర్హత సాధించిన వారికి బీటెక్ కోర్సు సహా లెఫ్టినెంట్ జాబ్స్‌కు ఉచితంగా శిక్షణ అందిస్తారు. ఈ పరీక్ష ద్వారా 90 ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తారు. 2025లో ప్రారంభం అయ్యే 52వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్( (TES) కోసం ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు జూన్ 13 చివరి తేదీ.
ఈ పరీక్ష రాయడానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం మార్కులతో 10 + 2 పాసై ఉండాలి. 16.5 ఏళ్ల నుంచి 19.5 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. కచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్స్ట్గా ఉండాలి. లేకపోతే జేఈఈ మెయిన్స్ 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. కచ్చితంగా ఆర్మీ అధికారులకు ఉండాల్సిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. స్టేజ్1 పరీక్షలో ఎంపికైన వారు స్టేజ్2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఎంపికైన వారికి ఇంటర్య్వూ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్లు ఉంటాయి. అప్పుడు మాత్రమే టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌లో ప్రవేశం లభిస్తుంది.