Bandaru Satyanarayana Murthy : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ తగ్గిపోయి బీపీ పెరిగింది. కుటుంబ సభ్యులు ఆయనను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాబోవు ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తులో భాగంగా జనసేన టిక్కెట్టు కోల్పోయింది. ఈ సీటును పంచకర్ల రమేష్‌బాబుకు కేటాయించారు. దీంతో సత్యనారాయణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరతారనే చర్చ సాగింది. వైసీపీలో చేరితే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.