తమిళ హీరో శివకార్తికేయన్, దర్శకురాలు సుధా కొంగర కాంబోలో ‘పరాశక్తి’ మూవీ తెరకెక్కింది. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో మలయాళ దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ క్యామియో రోల్లో కనిపించనున్నట్లు శివకార్తికేయన్ రివీల్ చేశాడు. అతను ఏ పాత్రలో కనిపించనున్నాడో మాత్రం చెప్పలేదు. ఇక ఇక ఈ సినిమాలో శ్రీలీల, రవి మోహన్, అథర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు.