అన్నమయ్య: చిత్తూరు రోడ్డులోని ఎస్టీ కాలనీలో కేర్ కమిటీ ఆధ్వర్యంలో మద్యం దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్సై మద్యం వల్ల ఆరోగ్య, కుటుంబ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.