GDWL: కవి, గాయకుడు అందెశ్రీ సంస్మరణ సభ ఈనెల 30న అయిజలో నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష కమిటీ నాయకులు వెంకట్రాములు, ఆంజనేయులు, విజయ భాస్కర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ సాయంత్రం 4:00 గంటలకు స్థానిక అఖిలపక్ష కమిటీ కార్యాలయంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సమావేశానికి సభ్యులు, ప్రజా సంఘాలు హాజరు కావాలని కోరారు.