బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) బచ్చన్ మరోసారి ర్యాంప్‌పై దేవతలా మెరిసిపోయింది. ఐశ్వర్య ప్యారిస్‌లో యువ ఫ్యాషన్ మోడళ్లతో సమానంగా క్యాట్ వాట్ చేసి ఫ్యాన్స్ కిర్రెక్కించారు. ఐశ్వర్య అంత పెద్ద వయసులోనూ చలాకీగావాక్ చేసి అభిమానులను హుషారెత్తించారు. ప్యారిస్ (Paris) ఫ్యాషన్ వీక్ లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లోకి చేరాయి.
ఐశ్వర్య వయసు తగ్గిందా? అన్నట్టుగా ఆమె ప్రదర్శన కనిపించింది. బ్రౌన్, గోల్డెన్ డ్రెస్ (Golden dress) ధరించి, హెయిర్ కలర్ ను కూడా అందుకు అనుగుణంగా మార్చేశారు. ఆడియన్స్ చూసి ఐశ్వర్యారాయ్ చిలిపిగా కన్ను కొట్టడమే కాదు, ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఔరా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న సెలబ్రిటీ మహిళలతో నిర్వహించిన ఈవెంట్లో ఐశ్యర్య రాయ్ సందడి ట్రెండింగ్(Trending) లో నిలిచింది. ప్రపంచవ్యాప్త సూపర్ సూపర్ మోడల్స్ తో ఈ వేడుక జరుపుకోవడం విశేషం. ఈ ఈవెంట్ కోసం ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) , కుమార్తె ఆరాధ్యతో కలిసి గత వారమే పారిస్ వెళ్లింది. ఈ క్రమంలో అభిషేక్ ఒక వీడియోను కూడా షేర్ చేశాడు. కాగా 2018, 2019 లో ఫ్యాషన్ వీక్‌లో కూడా ఐశ్వర్య మెరిసిన సంగతి తెలిసిందే.