జాతి పిత మహాత్మాగాందీ (Mahatma Gandhi) 154వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధాని మోదీ (PMMODI), లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు భారతీయులతో పాటు పలువురు విదేశీ నేతలు, ప్రతినిధులు కూడా మహాత్ముడి సేవలను గుర్తుచేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఆయనకు నివాళులర్పించారు. గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా ఆ మహాత్ముడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
ఆయన బోధనలు మన మార్గాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూనే ఉంటాయి. యావత్ ప్రపంచంపై ఆయన చెరగని ముద్ర వేశారు. ఐకమత్య స్ఫూర్తి, దయ వంటి గుణాలను మరింత వ్యాప్తి చేసేలా మానవాళిని ప్రేరేపించారు. ఆయన కలలను సాకారం చేసేందుకు మనం కృషి చేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.యావత్ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu), ఖర్గే, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా(Speaker Ombirla), కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, మీనాక్షీ లేఖి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.