Aishwarya Rai: ఏంది పాప ఇది.. రెండు డ్రెస్సులకు 105 కోట్లా?
హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి అందరికీ తెలిసిందే. అయితే.. ముద్దుగుమ్మ ధరించిన రెండే రెండు డ్రెస్సులకు 105 కోట్లు అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఈ వార్తల్లో నిజమెంత మరి?
Aishwarya Rai: వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఈజ్ పార్టీ అంటూ.. మెగాస్టార్‌తో చిందేసిన ఊర్వశీ రౌతేలా, ఆ తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోను ఆఫర్లు అందుకుంటోంది. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ ధరించిన రెండు డ్రెస్సులకు 105 కోట్లు ఖర్చు చేసిందనే న్యూస్ షాకింగ్‌గా మారింది. ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై ఎంతోమంది ఇండియన్ తారలు మెరిశారు. ఐశ్వర్య రాయ్ తోపాటు కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభితా దూళిపాళ్ల, అదితి రావ్ హైదరీ, ప్రీతి జింటా వాళ్లు వెళ్లారు. హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఈసారి కేన్స్‌లో మెరిసింది. మామూలుగా అయితే.. ఊర్వశీ ఏది చేసిన సెన్సేషన్‌గానే ఉంటుంది.
కానీ కేన్స్‌లో తను ధరించిన డ్రెస్సుల ధర చూస్తే, షాక్ కాదు.. మతిపోయేలా ఉన్నారు నెటిజన్స్. అసలు.. ఇందులో నిజమెంతో తెలియదు గానీ, కొన్ని రిపోర్ట్స్ మాత్రం ఊర్వశీ ఖరీదైన కాస్ట్యూమ్స్ ధరించినట్టుగా రాసుకొచ్చాయి. రెండు రోజుల పాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మెరిసింది ఊర్వశీ. ఫస్ట్ డే ఓ పింక్ గౌన్‌లో కనిపించింది. ఆ గౌను ఖరీదు అక్షరాలా 47 కోట్ల అని ఓ రిపోర్టు వెల్లడించింది. కానీ.. ఇందులో నిజం లేదని, ఈ డ్రెస్ కాస్ట్ 7 కోట్లే అని కూడా అంటున్నారు. అయినా కూడా.. ఇదినూ షాకింగే. ఇక ఆ తర్వాత ఊర్వశి రౌతేలా మరింత ఖరీదైన డ్రెస్‌లో వచ్చినట్టుగా చెబుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా 58 కోట్లు అని అదే రిపోర్టు తెలిపింది. ఈ లెక్కన రెండు డ్రెస్సులు కలిపి 105 కోట్లు అన్నమాట. కానీ ఇలాంటి రిపోర్ట్స్లలో నిజం లేదని అంటున్నారు. అయినా కూడా.. ఇలాంటి వార్తలు మాత్రం నెటిజన్స్‌కు షాకింగ్ అనే చెప్పాలి.