Rashmika Mandanna: మరోసారి రష్మికతో పోటీ పడనున్న త్రిప్తి?
రష్మిక చేతిలో ప్రస్తుతం డేట్స్ అడ్జెస్ట్ చేయలేనంత సినిమాలున్నాయి. కానీ ఒకే ఒక్క సినిమాతో రష్మికకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది త్రిప్తి డిమ్రి. దీంతో.. మరోసారి ఈ ముద్దుగుమ్మలు కలిసి నటించనున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది.
Rashmika Mandanna: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ‘అనిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఒక ‘ఏ’ రేటేడ్ సినిమాగా ఏకంగా 900 కోట్లు రాబట్టి సంచలనంగా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. అలాగే.. హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి స్పెషల్ రోల్లో కనిపించింది. అయితే.. సినిమా చివర్లో వచ్చిన త్రిప్తి గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. అమ్మడి అందానికి థియేటర్లో చెమటలు పట్టాయి. అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, ఒక్క అనిమల్తో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది త్రిప్తి. ఏకంగా రష్మికను సైతం డామినేట్ చేసిందనే కామెంట్స్ వచ్చాయంటే.. అమ్మడి ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే.. అనిమల్ రిలీజ్ అయినప్పుడు రష్మిక వర్సెస్ త్రిప్తి అన్నట్టుగా టాక్ నడిచింది.
ఇక ఇప్పుడు మరోసారి ఈ ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో కనిపించనుండడం విశేషం. మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2లో రష్మిక హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో శ్రీవల్లిగా అదరగొట్టింది రష్మిక. అయితే.. పుష్ప పార్ట్ 1లో ఐటెం సాంగ్ మాత్రం రచ్చ రంబోలా చేసింది. ఈ పాటతో సమంత షేక్ చేసింది. అందుకే.. ఇప్పుడు పుష్ప2లో అంతకుమించిన సాంగ్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే చాలామంది ముద్దుగుమ్మల పేర్లు వినిపించినప్పటికీ.. ఫైనల్‌గా కుర్రాళ్ల హాట్ కేక్‌గా ఉన్న త్రిప్తిని ఈ ఐటెం సాంగ్ కోసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మరోసారి రష్మిక, త్రిప్తి హాట్ టాపిక్ అవడం గ్యారెంటీ. ఏదేమైనా.. ఈసారి త్రిప్తి దెబ్బకు కుర్రకారు మరింత టెంప్ట్ అవడం గ్యారెంటీ.