ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల్లో కల్కి 2898 ఏడి, పుష్ప2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. బిజినెస్ పరంగా ఈ సినిమాల్లో ఎవరిది పై చేయి అనేది ఆసక్తికరంగా మారింది.
Pushpa2: ఇప్పటికే కల్కి, పుష్ప2 మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. పుష్ప2 ఆగష్టు 15న రిలీజ్ కానుండగా, కల్కి జూన్ 27న థియేటర్లోకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమాల బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మూవీ మేకర్స్. అయితే.. ఈ సినిమాల్లో పుష్ప2 బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఒక్క హిందీలోనే 200 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్టుగా టాక్ ఉంది. కల్కికి మాత్రం 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. అయితే.. తెలుగులో మాత్రం ఈ రెండు సినిమాలకు భారీ డిమాండ్ ఉంది. 200 కోట్ల వరకు బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. మిగతా భాషల్లోను గట్టిగానే అమ్ముడుపోయినట్టుగా సమాచారం. కానీ తాజాగా నార్త్ ఇండియా మార్కెట్లో పుష్ప 2దే పై చేయి అన్నట్టుగా తెలుస్తోంది.
ఓవర్సీస్ హక్కుల కోసం వంద కోట్లు కోట్ చేస్తున్నారని వినిపించగా.. ఒక్క నార్త్ అమెరికాలోనే 60 కోట్ల మేర బిజినెస్ అయ్యిందట. ఈ మధ్య కాలంలో ఇదే హైయెస్ట్ బిజినెస్ అంటున్నారు. అయితే.. ఇదే నార్త్ అమెరికా కల్కి బిజినెస్ 50 కోట్లకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తుంది. కల్కి నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్‌ను ప్రత్యంగిర సినిమాస్ అండ్ AA క్రియేషన్స్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే.. ఒక్కో ఏరియాను బట్టి పుష్ప2, కల్కి మేకర్స్ డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఓవరాల్‌గా చూసుకుంటే, కల్కి కంటే పుష్ప2 బిజినెస్ ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ఇలాంటి విషయాల్లో మరింత క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.