Devara: పది ఊర్ల కాపరిగా దేవర.. ఎరుపెక్కనున్న థియేటర్లు?
రియల్ లైఫ్‌లో ఎర్ర సముద్రం చూసి ఉంటారు.. కానీ దేవర ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రాన్ని ఇంతవరకు చూసి ఉండరు. దేవర సినిమాలో రక్తంతో ఎరుపెక్కిన సంద్రాన్ని చూపించబోతున్నాడు కొరటాల శివ. లేటెస్ట్ లీక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Devara: దేవర చేసే మృగాల వేటకు సముద్రమే కాదు.. అక్టోబర్ 10న థియేటర్లు కూడా ఎరుపెక్కబోతున్నాయ్. ఎన్టీఆర్ చేత కొరటాల శివ చేయిస్తున్న విధ్వంసానికి బాక్సాఫీస్ బద్దలయ్యేలా ఉంది. ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌తో.. దూకే ధైర్యమా జాగ్రత్త, దేవర ముంగిట నువ్వెంత.. అంటూ శాంపిల్ చూపించారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఫియర్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. 60 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని చెబుతూ.. దేవర అభిమానుల కోసం అంటూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. ఈ ఒక్క పోస్టర్ చాలు.. దేవర బాక్సాఫీస్ విధ్వంసానికి.. అనేలా ఉంది.
ఎరుపెక్కిన సముద్ర వీరుడు ఎలా ఉంటాడో.. అలా ఉన్నాడు యంగ్ టైగర్. కొరటాల శివ చెప్పినట్టుగా దేవర మామూలుగా ఉండేలా లేదు. సినిమాలో భాగమైన వారు ఈ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తున్నారు. సముద్ర తీరంలోని పది ఊర్లకు కాపరిగా దేవర ఉంటాడని, సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఒకటి సినిమాకే హైలెట్‌గా ఉంటుందని, ఆ ఫైట్‌ని ఏకంగా పదివేల మందితో షూట్ చేశారని అంటున్నారు. ఈ ఫైట్‌లోనే దేవర ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రాన్ని చూస్తారని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు చూడని ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని దేవరలో చూస్తారని హైప్ ఎక్కిస్తున్నారు. మేకర్స్ కూడా అంతకుమించిన మాస్ ట్రీట్ ఇస్తున్నారు. మరి దేవర ఎలా ఉంటుందో చూడాలి.