»Indian Actress Anasuya Sengupta Won The Best Actress Award At The Cannes Film Festival
Anasuya Sengupta: కేన్స్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా సత్తా చాటిన భారతీయ నటి
ప్రపంచ సినిమా వేడుక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు విభాగాల్లో విజేతలను ప్రకటిస్తుంది. తాజాగా మన భారతదేశానికి చెందిన ఓ నటి ఉత్తమ నటిగా అవార్డు అందుకొని సరికొత్త రికార్డును సృష్టించింది.
Indian actress Anasuya Sengupta won the best actress award at the Cannes Film Festival
Anasuya Sengupta: ప్రతీ సంవత్సరంలాగే ఈ ఏడాదికూడా ఫ్రాన్స్‌లో సినిమా సందడి మొదలైంది. ఎంతో అట్టహాసంగా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతొంది. ఇప్పటి భారత్ నుంచి పలువురు తారాలు సందడి చేశారు. పలు విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తుండగా తాజాగా భారతీయ నటి చరిత్ర సృష్టించింది. నటి అనసూయ సేన్‌గుప్తా (Anasuya Sengupta) అన్ సర్టెయిన్ రిగార్డ్ విభాగంలో ఉత్తమ నటి (Best Actress award)గా అవార్డు కైవసం చేసుకున్నారు. ఈ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా ఈమె అరుదైన రికార్డు సాధించింది. బల్గేరియన్ డైరెక్టర్ కాన్స్టాంటిన్ బొజనోవ్ దర్శకత్వంలో ది షేమ్‌లెస్ (The Shameless) అనే చిత్రంలో అనుసూయ సేన్‌గుప్తా నటించింది. ఇందులో రేణుక అనే సెక్స్ వర్కర్ పాత్రను పోషించింది.
ఈ చిత్రాన్ని భారత్, నేపాల్ ప్రాంతాలలో నెలన్నర పాటు షూటింగ్ చేశారు. ఈ చిత్రాన్ని కేన్స్ వేడుకలో ప్రదర్శించిగా విశేష స్పందన వచ్చింది. కోల్‌కతాకు చెందిన అనసూయ ముంబయిలో ప్రొడక్షన్ డిజైనర్‌గా కొన్నాళ్లు పనిచేశారు. ఈ క్రమంలో డైరెక్టర్ బొజనోవ్ ఆమెకు ఫేస్బుక్ ఫ్రెండ్. తాను తీయనున్న ది షేమ్‌లెస్ చిత్రం కోసం అనసూయను ఆడిషన్ అడిగి సెలెక్ట్ చేశాడు. దాంతో అనసూయ ఈ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అవడమే కాకుండా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ చిత్రంలో తాను రేణుక పాత్ర పోషించింది. ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌస్‌లో పోలీసును చంపీ మరో రాష్ట్రానికి పారిపోతుంది. అదే రాష్ట్రంలో మరో బ్రోతల్ హౌస్‌లో ఆశ్రయం పొందుతూ దేవికతో ప్రేమలో పడుతుంది. తరువాత ఏం జరిగింది అనేది ది షేమ్‌లెస్ స్టోరీ.