Payal Kapadia: కేన్స్‌లో సత్తా పాయల్ కపాడియా.. గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాలు అదరహో అనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బెంగాలీ భామ సుయా సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకోగా...తాజాగా పాయల్ కపాడియా కూడా తన సత్తా చాటుకుంది.
Payal Kapadia: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమాలు అదరహో అనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బెంగాలీ భామ సుయా సేన్ గుప్తా ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకోగా…తాజాగా పాయల్ కపాడియా కూడా తన సత్తా చాటుకుంది. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమాకు గ్రాండ్ ప్రిక్స్ అవార్డు దక్కించుకుంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పాయల్ కపాడియాను అభినందించారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారత సినిమాలు తమ హవా కొనసాగిస్తున్నాయి, అవార్డులను దక్కించుకుంటున్నాయి. గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో .. ఆల్ వీ ఇమాజిన్ యాజ్ లైట్ అనే చిత్రానికి పాయల్ కపాడియా అవార్డు అందుకుంది. కేరళకు చెందిన ఇద్దరు మళయాలీ నర్సుల జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కేన్స్‌లో ఈ సినిమా ప్రదర్శన పూర్తి కాగానే దాదాపు 8 నిమిషాల పాటు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో 1994లో భారత దేశానికి చెందిన శాజీ కరుణ్ కేన్స్‌లో సత్తా చాటారు. శాజీ కరుణ్కి చెందిన స్వాహం అనే సినిమా అప్పట్లో పోటీ పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇతర భారతీయ సినిమాకు గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో పోటీ పడేందుకు అవకాశం దక్కలేదు. తాజాగా పాయల్ కపాడియా సత్తా చాటడంతో అవార్డు సొంతమయింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరు కావడం, అక్కడ సత్తా చాటడం పాయల్ కపాడియాకు అలవాటుగా మారిపోయింది. గతంలో .. ఆఫ్టర్ నూన్ క్లౌడ్స్ అనే షార్ట్ ఫిల్మ్, నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ అనే డాక్యుమెంటరీ చిత్రాలను కూడా కేన్స్‌లో ప్రదర్శించి.. ప్రశంసలు అందుకుంది. ఈ సారి ఏకంగా గ్రాండ్ ప్రిక్స్ విభాగంలో అవార్డు సాధించింది. ఇటీవలే బెంగాలీ భామ సూయా సేన్ గుప్తా చరిత్ర సృష్టించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివలలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. వాన్ సరైయిన్ ‘రిగార్డ్’ విభాగంలో ఈ అవార్డు సొంతం చేసుకుంది. తాజాగా పాయల్ కపాడియా కూడా అవార్డు దక్కించుకోవడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇద్దరు ప్రతిభామూర్తులను అభినందనలు కురిపించారు.