»Pavithra Gowda A1 And Challenging Star Darshan A2 In Renuka Swamy Murder Case
Darshan Case : మర్డర్ కేసులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్
మర్డర్ కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్‌ను ఆ కేసులో ఏ2గా పోలీసులుచేర్చారు. అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడను ఏ1గా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Darshan Case Latest Update : కన్నడ హీరో దర్శన్ ఓ మర్డర్ కేసులో నిందితుడిగా అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కన్నడనాటే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన అభిమాని రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో దర్శన్‌ను(DARSHAN) ఏ2గా, పవిత్ర గౌడను(Pavithra Gowda) ఏ1గా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రేణుకా స్వామి హత్య జరిగిన తర్వాత దర్శన్ తన సన్నిహితులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ కేసులో సాక్ష్యాధారాలను మాయం చేయడానికి, తన పేరు బయటకి రాకుండా ఉండటానికి దర్శన్ సాయశక్తులా ప్రయత్నించారు. దగ్గరవారి నుంచి రూ.40లక్షలు అప్పు చేసి తీసుకున్నారు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్రగౌడ, దర్శన్‌లతో పాటు మిగిలిన నిందితులని జ్యూడీషియల్ కస్టడీకి పంపంచాలని కోరుతూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు.
నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించిన తర్వాత ఈ కేసులో రేణుకా స్వామి హత్యకు ప్రధాన కారణం పవిత్ర గౌడ అని పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. ఆమే మిగిలిన నిందితుల్ని హత్యకు ప్రేరేపించి వారితో నేరంలో పాల్గొన్నట్లు తేల్చారు. దర్శన్ కూడా ఈ హత్యలో స్వయంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. హత్య అనంతరం వారు ఆధారాలను మాయం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించారని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఏ9గా ఉన్న ధనరాజ్ అనే నిందితుడు హత్యకు సంబంధించి మరిన్ని విషయాలను వాంగ్మూలంలో తెలిపాడు. హత్యకు ముందు రేణుకా స్వామికి(RENUKA SWAMY) ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చేందుకు ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ అనే పరికరాన్ని వినియోగించినట్లు తెలిపాడు.