»The Study Showed That An Earthquake That Occurred 2500 Years Ago Changed The Direction Of The Ganga River
Ganges River : ఆ భూకంపం గంగా ప్రవాహ దిశను మార్చేసిందా?
గంగా నది ఎప్పటి నుంచో ఒకే దిశలో ప్రవహించడం లేదట. అది 2500 సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపం వల్ల తన దిశను మార్చుకుని ప్రవహించడం మొదలుపెట్టిందని అధ్యయనంలో తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Ganges River : భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే నది గంగా. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద నదిగానూ దీనికి పేరుంది. ఇలాంటి అతి పొడవైన నది వందల సంవత్సరాల క్రితం ఒక్కసారే హఠాత్తుగా దిశను మార్చుకుని ప్రవహించడం మొదలు పెట్టిందట. దాదాపుగా 2500 సంవత్సరాల క్రితం ఈ ఘటన చోటు చేసుకుందిట. ఆ సమయంలో రిక్టరు స్కేలుపై 7 – 8 తీవ్రతతో ఓ పెద్ద భూకంపం(Earthquake) సంభవించిందిట. దానితో నది ప్రవాహ దిశను మార్చుకుని ఇప్పుడు ఉన్న దిశలోకి(Direction) ప్రవహించడం మొదలు పెట్టిందట.
గంగానదిలపై(Ganga River) కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ఈ సంగతులన్నీ ప్రచురితం అయ్యాయి. సాధారణంగా ఓ నది ప్రవాహ దిశను మార్చుకునేందుకు వందల ఏళ్లు పడుతుంది.గంగా నది లాంటి పెద్ద నదులు దిశ మార్చుకోవాలంటే ఇంకా కష్టం. అయితే గంగా నది మాత్రం అతి పెద్ద భూకంప తాకిడి వల్ల ఉన్నట్లుండి తన ప్రవాహ దిశను మార్చుకుని ఇప్పుడున్నట్లుగా ప్రవహించడం మొదలు పెట్టిందని తేలింది.
గంగా నదికి(The Ganga River) సంబంధించిన కొన్ని ఉపగ్రహ ఛాయా చిత్రాలను పరిశోధకుకలు నిశితంగా పరిశీలించారు. వాటిలో పాత గంగా నది ప్రవాహ దిశా మార్గాన్ని గుర్తించారు. 100 కిలోమీటర్ల మేర ఆ ప్రవాహ మార్గం ఎటుందో గమనించారు. అది ఇప్పటి నదికి భిన్నంగా, వేరే దిశలో ఉందని తేల్చారు. ఇలా ఉన్నట్లుండి దిశను మార్చుకోవడం భూకంపాల(Earthquakes) వల్ల మాత్రమే సాధ్యమవుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.