»Delhi High Court A Persons Petition In The Court That All The Land Between The Rivers Belongs To Me What Happened In The End
Delhi High Court: నదుల మధ్య భూమంతా నాదేనని కోర్టులో ఓ వ్యక్తి పిటిషన్.. చివరకు ఏం జరిగిందంటే?
యమున, గంగా నదుల మధ్య ఉన్న భూమంతా తనదే అంటూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అతని పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే న్యాయస్థానం సమయం వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించింది.
Delhi High Court: యమున, గంగా నదుల మధ్య ఉన్న భూమంతా తనదే అంటూ ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అతని పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే న్యాయస్థానం సమయం వృథా చేసినందుకు రూ.లక్ష జరిమానా విధించింది. యమున, గంగా నదుల మధ్య ఉన్న ఆగ్రా మేరఠ్, అలీగఢ్‌తో పాటు ఢిల్లీ, ఉత్తరాఖండ్, గురుగ్రామ్‌లోని 65 రెవిన్యూ ఎస్టేట్లకు తానే యాజమానినంటూ పిటిషనర్ మహేందర్ ధ్వజ్ ప్రసాద్ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
తాను బేస్వాన్ అవిభాజ్య రాజ్య వారసుడినని, 1947లో ఇండియన్ యూనియన్‌లో తన సంస్థానం కలవలేదని తెలిపారు. అంతేకాదు, 1950 తర్వాత తన భూములపై వసూలు చేసిన పన్నులన్నీ ప్రభుత్వం తిరిగి తనకు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. తన ప్రాంతంలో లోక్‌సభ, రాజ్యసభ, స్థానిక ఎన్నికలనే కేంద్రం నిర్వహించకూడదని తెలిపారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసి జరిమానా విధించింది.