»Uttarakhand God Said Thats Why I Built A Temple At A Height Of 16 Thousand Feet
Uttarakhand: దేవుడు చెప్పాడు.. అందుకే 16వేల అడుగుల ఎత్తులో గుడి కట్టుకున్నాను
ఉత్తరాఖండ్లో ఓ బాబా 16వేల అడుగుల ఎత్తులో ఓ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఈ వ్యవహారం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దేవుడు చెప్పాడని పవిత్ర సరస్సుకు అత్యంత సమీపంలో 16వేల అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించుకున్నాడు.
Uttarakhand: God said.. that's why I built a temple at a height of 16 thousand feet
Uttarakhand: ఉత్తరాఖండ్లో ఓ బాబా 16వేల అడుగుల ఎత్తులో ఓ ఆలయాన్ని నిర్మించుకున్నాడు. ఈ వ్యవహారం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. దేవుడు చెప్పాడని పవిత్ర సరస్సుకు అత్యంత సమీపంలో 16వేల అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించుకున్నాడు. బాగేశ్వర్ జిల్లాలోని సుందర్ధుంగా హిమానీనదంపై ప్రభుత్వానికి చెందిన స్థలంలో అక్రమంగా కట్టాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబా చైతన్య ఆకాశ్ అలియాస్ ఆదిత్య కైలాశ్ కొంతమంది సాయంతో సముద్రమట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మించాడు.
మొదటి ఇతనికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దేవుడు కలలోకి వచ్చి గుడి కట్టమన్నారని ఆ బాబా చెప్పడంతో కొందరు స్థానికులు సాయం చేశారు. పవిత్ర దేవికుంద్ సరస్సు సమీపంలో హిమానీనదంపై ఈ గుడిని కర్రలు, రాళ్లతో నిర్మించాడు. గత 10-12 రోజులుగా ఆలయంలోనే బాబా ఉంటున్నాడు. ఎంతో పవిత్రంగా భావించే దేవికుంద్ సరస్సులో స్నానం చేయడం స్థానికులు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.