ఈరోజుల్లో యువత ఎక్కువగా డేటింగ్‌కి అలవాటు పడుతున్నారు. తెలిసి తెలియక కొందరు మైనర్లు డేటింగ్ చేస్తున్నారు. అయితే మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్టు చేయడం న్యాయమేనా అని ఉత్తరాఖండ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Uttarakhand: ఈరోజుల్లో యువత ఎక్కువగా డేటింగ్‌కి అలవాటు పడుతున్నారు. తెలిసి తెలియక కొందరు మైనర్లు డేటింగ్ చేస్తున్నారు. అయితే మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్టు చేయడం కరెక్టేనా? బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసులో కేవలం బాలురను మాత్రమే దోషులుగా పరిగణించి శిక్షిస్తున్నారని కొందరు పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికతో డేటింగ్ వెళ్లినందుకు పోక్సో చట్టం కింద శిక్షిస్తున్నారు. కానీ మైనర్ బాలికతో డేటింగ్ చేసినందుకు అబ్బాయిని అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించింది. అయితే డేటింగ్ చేసే బాలురను అరెస్టు చేయడం కంటే వాళ్లకు సలహా లేదా కౌన్సిలింగ్ ఇవ్వచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.