»Relief For Kcr In High Court Kcr Petitioned Against Justice Narasimha Reddy Commission
KCR: హైకోర్టులో కేసీఆర్‌కు ఊరట
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలురోకో కేసులో ఆయనపై 2011లో కేసు నమోదు అయింది. అలాగే విద్యుత్ కొనుగోలు విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వెనక్కి తీసుకోవాలి కేసఆర్ కోర్టును ఆశ్రయించారు.
Relief for KCR in High Court.. KCR petitioned against Justice Narasimha Reddy Commission
KCR: బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలురోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చేందు వరకు ఆయన్ను విచారణకు పిలవద్దని స్టే విధించింది. వచ్చే నెల 23 తేదీ వరకు ఆయన్ను విచారణకు పిలవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలాని ఆదేశించింది. 2011 తెలంగాణ ఉద్యమ సమయంలో రైలురోకోకు కేసీఆర్ పిలుపినిచ్చారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది. ప్రజాప్రతినిధుల కోర్టులో ఆయనపై ఉన్న కేసును కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
మరో వైపు విద్యుత్ కొనుగోలు విషయంలో ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ను ఏర్పాటు చేయడం సహజన్యాయ సూత్రాలకు విరుద్దమని, నిబంధనల ప్రకారం విద్యుత్ కొనుగోలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్మీట్లు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, విద్యుత్ విభాగాన్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత పదేండ్లలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపాలని, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్- 1952 కింద రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే విచారణ చేపట్టిన ఈ కమిషన్ సంబంధిత అధికారులను విచారించింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయగా.. ఈ కమిషన్‌పై నమ్మకం లేదు, అన్ని నిబంధనలకు అనుకూలంగానే కొనుగోలు చేశామని, ఈ కమిషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు.