గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణబాబు కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమై కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టి, అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని వయస్సు 30-35 ఏళ్లు ఉంటుందని, దేహంపై ‘తరుణ్’, చేతిపై ‘ఈశ్వర్’ పేర్ల పచ్చబొట్లు ఉన్నట్లు తెలిపారు.