WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని రంగాపురం గ్రామంలో గత 6 నెలల క్రితం పాడైపోయిన బోరుబావి స్థానంలో మంగళవారం నూతన బోరును ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా బోరు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.