GNTR: తెనాలి శివారు పూలే కాలనీలోని ఎస్టీపీ ప్లాంట్ను సబ్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. మంగళవారం ఉదయం కమిషనర్ జెఆర్ అప్పల నాయుడుతో కలిసి ప్లాంట్ పని తీరును ఆమె పరిశీలించారు. మురుగు నీటిని ఏ విధంగా శుద్ధి చేస్తున్నారు, రోజుకు ఎన్ని లీటర్ల కెపాసిటీ వంటి వివరాలను సబ్ కలెక్టర్కు కమిషనర్ వివరించారు.