KNR: హుజూరాబాద్‌లో బీసీ ప్రజాస్వామిక ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో, నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మానం జరిగింది. మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ.. మండలంలోని 20 స్థానాల్లో 15 చోట్ల బహుజనులు గెలవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం BCలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, ముక్కెర రాజు, పాల్గొన్నారు.