TG: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని DGP శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదిక విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ.. ‘పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన వరదలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. పోలీస్ సిబ్బంది బాగా పనిచేసి ప్రాణనష్టం లేకుండా చూశారు. రాష్ట్రంలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు’ అని తెలిపారు.