MLG: కన్నాయిగూడెం మండలం రాజన్నపేట గ్రామ నూతన సర్పంచ్‌గా పోడెం నర్సింగరావు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 22న సర్పంచుల ప్రమాణ స్వీకారం ఉండగా.. పెసా సమావేశాల కారణంగా నర్సింగరావు ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో ఆయన ప్రమాణం వాయిదా పడింది. నేడు మండల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాంబాబు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.