బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల ఆ దేశ మరో మాజీ ప్రధాని షేక్ హసీనా సంతాపం వ్యక్తం చేశారు. దేశ తొలి మహిళా ప్రధానిగా ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు ఆమె చేసిన కృషిని హసీనా కొనియాడారు. కాగా, ఖలీదా జియా అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఢాకాలోని జియా ఉద్యానవనంలో తన భర్త జియావుర్ రెహమాన్ సమాధి పక్కనే ఆమె పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు.