AP: చెంచులకు శ్రీశైలం బోర్డు శుభవార్త చెప్పింది. ఇకపై ప్రతి నెలలో ఒక రోజు చెంచు గిరిజనులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు శ్రీశైలం బోర్డు ఛైర్మన్ రమేశ్ వెల్లడించారు. ఈ మేరకు శ్రీశైలంలో చెంచులకు స్పర్శ దర్శనాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 500 మంది చెంచులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు.