MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో అల్లూరి సీతారామరాజు కాలేజీ పక్కన భారీగా చెత్త పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు చెల్లాచెదురుగా ఉండటంతో విద్యార్థులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ సమీపంలోనే చెత్త కుప్పలు ఉండటం ఆరోగ్యానికి ముప్పుగా మారిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ చెత్త తరలింపులో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.