స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి సంస్థలకు పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్లు రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 10 నిమిషాల డెలివరీ మోడల్‌ను రద్దు చేయాలని, సరైన వేతనం, ప్రమాద బీమా కల్పించాలని, చిన్న కారణాలతో ఐడీలను బ్లాక్ చేయడాన్ని నిరసిస్తూ రేపు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీంతో రేపు ఆన్లైన్ ఫుడ్, గ్రాసరీ డెలివరీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.