మిత్రదేశాలైన సౌదీ అరేబియా, UAE మధ్య విభేదాలు పెరిగాయి. యెమెన్‌లోని వేర్పాటువాదులతో UAE సంబంధాలు కలిగి ఉండటంపై సౌదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. UAE తీసుకుంటున్న చర్యలు ప్రమాదకరంగా ఉన్నాయని, ఇవి ప్రాంతీయ సుస్థిరతకు హాని కలిగిస్తాయని సౌదీ హెచ్చరించింది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో పెద్ద మార్పులు రావచ్చన్న సంకేతాలను ఇచ్చాయి.