SRPT: జిల్లాలో 2025–26 ఖరీఫ్ సీజన్లో 62,887 మంది రైతుల నుంచి 3,27,579.280 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ సేకరణ పూర్తయిందన్నారు. ఇందుకు గాను రైతులకు రూ.782.59 కోట్లు మద్దతు ధరగా, రూ.113.65 కోట్లు బోనస్‌గా చెల్లిస్తున్నట్లు తెలిపారు.