AKP: కోటవురట్ల మండలంలో రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద 60 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారిణి సరోజిని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు సాగు చేస్తున్న పంటలకు యూరియాను సిద్ధం చేశామన్నారు. మరో 24 మెట్రిక్ టన్నుల యూరియాకు ఇండెంట్ పంపించామని పేర్కొన్నారు.