భారత యువ బ్యాటర్ షెఫాలి వర్మ శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో అదరగొడుతుంది. చివరి టీ20లో షెఫాలి మరో 75 పరుగులు చేస్తే మహిళల Iటీ20 సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. ఈ సిరీస్లో షెఫాలి ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు హేలీ మాథ్యూస్ (310) పేరిట ఉంది.